కరోనా కొత్త వేరియంట్ తో భయం లేదు : కేంద్ర మంత్రి

-

ప్రపంచాన్ని కరోనా మరోసారి వణికిస్తోంది. దేశవ్యాప్తంగా కొవిడ్ కొత్త వేరియంట్‌ జేఎన్‌ 1 చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే కేంద్ర సర్కార్ అప్రమత్తమై రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. రాష్ట్రాలు కూడా కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాయి. కొత్త వేరియంట్పై దేశవ్యాప్తంగా భయాందోనలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర పర్యటకశాఖ సహాయమంత్రి శ్రీపాద్ నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ జేఎన్ 1 వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ తెలిపారు. లాక్డౌన్ పెట్టకుండానే భారత్ ఈ మహమ్మారిపై పోరాడగలదని చెప్పారు.

మరోవైపు న్యూ వేరియంట్ జేఎన్‌ 1 కోసం అదనపు డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిన అవసరం లేదని సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్షియం (ఇన్సాకాగ్‌) అధిపతి డాక్టర్‌ ఎన్‌కే అరోరా తెలిపారు. ఇది వ్యాపించకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 60 ఏళ్లు పైబడినవారు, క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స తీసుకుంటున్నవారు, ఒకటి కంటే ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్నవారు ఈ వేరియంట్తో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దీనికి అదనపు డోస్‌ వ్యాక్సిన్‌ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news