గుడ్ న్యూస్.. బంగారం, మొబైల్ ఫోన్స్ పై కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు

-

లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. ఈ క్రమంలో మహిళలకు శుభవార్త చెప్పారు. ముఖ్యంగా బంగారం అంటే ఇష్టపడే మగువలకు ఇది గుడ్న్యూస్ అని చెప్పొచ్చు. బంగారం, వెండిపై కస్టమ్‌ డ్యూటీ తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బంగారం, వెండిపై సుంకం 6 శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ప్లాటినమ్‌పై 6.4 శాతాననికి కుదింపు చేస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు అంకురాలు, ఆవిష్కరణల ప్రోత్సాహానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని తరగతుల పెట్టుబడిదారులపై ఏంజెల్‌ ట్యాక్స్‌ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వృత్తి నిపుణులు విదేశాల్లో కలిగివున్న చరాస్తులపై సమాచారం ఇచ్చి తీరాలిని.. లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. గతేడాది రికార్డు స్థాయిలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు జరిగాయని పేర్కొంది. కస్టమ్స్‌ సుంకాల్లో మార్పులు చేసినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆదాయపన్ను చెల్లింపుదార్లులో మూడింటా రెండొంతుల మంది కొత్త విధానంలోకి వచ్చారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version