బిపోర్​బాజ్ బీభత్సం.. గుజరాత్​లో అతి భారీ వర్షాలు

-

బిపోర్‌జాయ్ తుపాను గుజరాత్​లో బీభత్సం సృష్టించింది. గుజరాత్ కచ్‌ ప్రాంతంలోని కోట్‌ లఖ్‌పత్‌ సమీపంలో గురువారం రాత్రి తీరాన్ని తాకింది. ఇది పూర్తిగా తీరాన్ని దాటేందుకు దాదాపు 6 గంటల సమయం పట్టిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుపాను ప్రభావంతో గుజరాత్ తీరంలో భీకర గాలులు వీస్తున్నాయి. కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. అరేబియాలో పది రోజులకుపైగా కొనసాగిన తొలి తుపానుగా ఇది నిలిచిపోనుంది.

తుపాను ప్రభావంతో కచ్, జామ్‌నగర్‌, రాజ్‌కోట్, పోర్‌బందర్, దేవ్‌భూమి ద్వారక, ఆమ్రేలీ సహా పలు ప్రాంతాల్లో… భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సౌరాష్ట్ర, కచ్ తీరాలతోపాటు దమణ్‌ ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. భీకర గాలుల కారణంగా కచ్‌ జిల్లాలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, వృక్షాలు కూలిపోయాయి. పలు ప్రాంతాల్లో.. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుపాను తీరం దాటిన పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ముందుజాగ్రత్త చర్యగా దాదాపు 20 తీరప్రాంత గ్రామాలకు చెందిన లక్ష మంది ప్రజలను.. ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news