కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌

-

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఉగాది పండుగ వేళ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. డియర్‌నెస్‌ అలవెన్సును (DA) 2 శాతం మేర పెంచుతున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ శుక్రవారం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని కేంద్ర సర్కార్ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

డీఏ సవరణ తర్వాత డీఏ మొత్తం బేసిక్‌ శాలరీలో 53 శాతం నుంచి 55 శాతానికి పెరగనున్నట్లు సమాచారం. దీంతో ఆ మేర ఉద్యోగుల వేతనం పెరగనుంది. డీఏ పెంపుతో లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. డీఏ పెంపు వార్తలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక చివరగా గతేడాది జులైలో డీఏను 50 శాతం నుంచి 53 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. ప్రతి ఏడాది రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్రం సవరిస్తూ ఉంటుందని తెలిసిన విషయమే. పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ అందజేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version