అమానవీయం.. అమ్మవారి విగ్రహాన్ని తాకాడని దళిత బాలుడికి..

-

ప్రపంచం ఎంత వేగంగా ముందుకెళ్తోన్నా కొన్నిప్రాంతాలు మాత్రం మూఢనమ్మకాలు, అంటరానితనంతో ఇంకా వెనకబడే ఉన్నాయి. ఇప్పటికీ దళితులను గుడిలోకి రానివ్వని కొన్ని ప్రాంతాలున్నాయి. అలాంటి వాటిలో ఒకటే.. కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని ఓ గ్రామం. ఇటీవల జరిగిన గ్రామ దేవత ఉత్సవంలో ఓ దళిత బాలుడు అమ్మవారి విగ్రహాన్ని తాకాడని అతటి కుటుంబానికి గ్రామ పెద్ద రూ.60 వేలు జరిమానా విధించారు.

రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబం అంత మొత్తం చెల్లించుకోలేక గ్రామ పెద్దలను బతిమాలింది. అయినా కనికరించని వారు.. జరిమానా చెల్లించకపోతే గ్రామాన్ని విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఈ ఘటన జరిగిన కొద్దిరోజుల తర్వాత దళిత సంఘాల నాయకులు.. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి సెప్టెంబరు 20న స్థానిక పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు..దళిత కుటుంబానికి జరిమానా విధించిన మొత్తం ఎనిమిది మందిని గ్రామపెద్దలను అరెస్టు చేశారు. అనంతరం భూతమ్మ గుడి తాళం పగలగొట్టి చేతన్​ కుటుంబాన్ని ఆలయంలోకి తీసుకెళ్లి ప్రార్థనలు చేయించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version