ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పై కీలక ప్రకటన రానుంది. నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది. ఇవాళ మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్ భవన్ లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్.
ఫిబ్రవరి 15 తో ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ముగుస్తుంది. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. త్రిముఖ పోరుతో ఉత్కంఠ రేపనున్నాయి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాయి బిజెపి, ఆప్, కాంగ్రెస్. ఇక ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది.