ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కు ఢిల్లీ కోర్టు వార్నింగ్ ఇచ్చింది. కోర్టు రూమ్‌లో రాజకీయ ప్రసంగాలు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. మనీల్యాండరింగ్ కేసులో కోర్టుకు హాజరైన ఎంపీ సంజయ్ సింగ్.. స్పెషల్ జడ్జి నాగపాల్ ముందు మాట్లాడుతూ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ గురించి ప్రస్తావించారు.
ఆ సమయంలో జడ్జి నాగపాల్ సీరియస్ అయ్యారు. అదానీ, నరేంద్రమోదీ గురించి ప్రసంగం చేయాలనుకుంటే, తర్వాత విచారణలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేయనున్నట్లు జడ్జి పేర్కొన్నారు. అదానీపై ఇచ్చిన ఫిర్యాదుల పట్ల విచారణ ఏజెన్సీలు సరైన రీతిలో పనిచేయలేదని సింగ్ ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరైన ఎంపీ సంజయ్‌కు జడ్జి నాగపాల్ వార్నింగ్ ఇచ్చారు. అనవసరమైన విషయాలను కోర్టులో మాట్లాడరాదు అని పేర్కొన్నారు. కస్టడీ విచారణ సమయంలో ఈడీ తనను సరైన ప్రశ్నలు వేయలేదన్నారు.