దేశ రాజధాని ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళకు వెళ్తున్న.. భక్తులు తొక్కిసలాటకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే వేగంగా 18 మంది మరణించారు. అయితే ఈ సంఘటనపై తాజాగా రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ సంఘటనలో మరణించిన వారికి నష్టపరిహారం ప్రకటించింది రైల్వే శాఖ.

ఈ సంఘటనలో మరణించిన వారికి ఒక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించబోతున్నట్లు వెల్లడించింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి తలో 2.5 లక్షలు ఇవ్వనుంది. ఇక స్వల్పంగా గాయపడ్డ వారికి తలో లక్ష రూపాయలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది రైల్వే శాఖ. ఈ మెరకు అధికారిక ప్రకటన కూడా చేసింది. అటు దేశ రాజధాని ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట పై ప్రధాని మోడీ కూడా ఆరా తీస్తున్నారు.