తులసిమాలను వేసుకోవడం వలన ఆధ్యాత్మిక ప్రయోజనాలతో పాటు.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా..!

-

కేవలం దీక్ష సమయంలో మాత్రమే కాకుండా తులసిమాలను సహజంగా కూడా ధరించవచ్చు. చాలా మంది తులసిమాలను ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు అని భావించి దీనిని ధరిస్తారు. అయితే తులసిమాలను ధరించే వారు తగిన నియమాలను కూడా పాటించాలి. ఎందుకంటే ఈ తులసిమాల ఎంతో పవిత్రమైనది అని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా దీనిని ధరించడం వలన భగవంతుని అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. ఎప్పుడైతే ఈ తులసి మాలను ధరిస్తారో ప్రతికూల శక్తి అనేది తొలగిపోతుంది.

ఆధ్యాత్మిక శ్రేయస్సుని పొందాలంటే తులసిమాలను తప్పకుండా ధరించాలి. చాలామంది తులసి మాలను ధరించి స్నానం చేయడం వలన ఎంతో పుణ్యం దక్కుతుంది అని భావిస్తారు. అదే విధంగా ఆరోగ్యానికి కూడా తులసిమాల ఎంతో సహాయం చేస్తుంది. ఎవరైతే తులసిమాలను ప్రతిరోజు ధరిస్తారో రక్తపోటు సమస్య కంట్రోల్ లో ఉంటుంది మరియు రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఇది సహాయపడుతుంది. చాలా శాతం మంది ధ్యానం చేయడానికి మాలను ఉపయోగిస్తారు. ఎప్పుడైతే తులసిమాలతో ధ్యానం చేస్తారో ఏకాగ్రత మరింత పెరుగుతుంది మరియు ఎంతో ప్రశాంతతను కూడా పొందవచ్చు.

ఈ విధంగా ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చు. తులసిమాలను వేసుకోవడం వలన దృష్టి మెరుగుపడుతుంది మరియు ఏకాగ్రత పెరుగుతుంది. ఆందోళన వంటి సమస్యలతో బాధపడేవారు కచ్చితంగా తులసిమాలను ధరించడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఈ విధంగా ఆధ్యాత్మిక ప్రయోజనాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా తులసిమాల ద్వారా పొందవచ్చు. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి భగవంతుడికి ప్రార్థించి తులసిమాలను వేసుకోవడం వలన ఎంతో మంచి జరుగుతుంది మరియు విష్ణు సహస్రనామాలు వంటివి చదువుతూ మాలను ధరించడం వలన ఎంతో పుణ్యం కూడా దక్కుతుంది. కనుక ఈ ప్రయోజనాలను పొందాలంటే తప్పకుండా తులసిమాలను వేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news