ప్లాస్మా థెరపీ: వాళ్ళు ప్రయోజనం లేదన్నారు.. వీళ్ళు కంటిన్యూ చేస్తా అంటున్నారు.

-

కరోనా వైరస్ కి ఇప్పటి వరకు మందు కనుక్కోబడలేదు. వ్యాక్సిన్ పై ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే మనం చేయాల్సిన పని. ఐతే కరోనాతో బాధపడుతున్న వారికి ప్లాస్మా థెరపీ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు చాలా మంది ప్లాస్మా దానం చేయడానికి ముందుకు వస్తున్నారు. అంతేకాదు ప్లాస్మా దానంపై అవగాహన కల్పిస్తున్నారు.

ఐతే తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు ప్లాస్మా ద్వారా పెద్దగా ప్రయోజనం ఉండట్లేదని ప్రకటించారు. ఈ విషయమై ఢిల్లీ ప్రభుత్వం ఐసీఎమ్ ఆర్ కి వ్యతిరేకంగా ప్లాస్మా థెరపీని కంటిన్యూ చేస్తామని అంటోంది. ఐతే కేంద్ర ఆరోగ్యమంత్రి మాట్లాడుతూ, ఐసీఎమ్ ఆర్ ప్లాస్మా థెరపీ పూర్తిగా పనిచేయట్లేదని చెప్పలేదని, కరోనా కారణంగా వెంటిలేటర్ పై ఉండేవాళ్లకి దాని వల్ల పెద్దగా ఉపయోగం లేదని చెప్పిందని, అంతేకానీ రోగ తీవ్రత ఎక్కువ నుండి బాగా ఎక్కువ ఉన్నవారికి బాగానే పనిచేస్తుందని చెప్పిందని తెలిపారు. వెంటిలేటర్ వరకి రానంత వరకూ ప్లాస్మా ఉపయోగపడుతుందని, ఆ తర్వాత ప్లాస్మా థెరపీ ప్రయోజనం లేదని ఐసీఎమ్ ఆర్ ప్రకటించిందని కేంద్ర ఆరోగ్యమంత్రి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version