Priayansh Arya: 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదిన ఢిల్లీ కుర్రాడు

-

Delhi Youngster Priyansh Arya Emulates Yuvraj Singh’s Historic Feat: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ యువరాజును మళ్లీ గుర్తు చేశాడు ఓ స్టార్‌ ప్లేయర్‌. యువ కెరటం ప్రియాన్ష్ ఆర్య ఓకే ఒవర్లో ఆరుసార్లు బంతిని స్టాండ్స్ లోకి పంపాడు. అంతేకాదు మెరుపు శతకంతో చెలరేగాడు. 50 బంతుల్లోనే 10 ఫోర్లు, 10 సిక్సర్లతో సెంచరీ చేశాడు. తద్వారా ఐపీఎల్ మెగా వేళానికి ముందు ఈ యంగ్ స్టర్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు.

Delhi Youngster Priyansh Arya Emulates Yuvraj Singh’s Historic Feat

ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో ప్రియాన్ష్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ బౌలర్లను ఊచకోత చేస్తూ బౌండరీల వర్షాన్ని కురిపించాడు. కేవలం 50 బంతుల్లోనే 120 రన్స్ చేశాడు. ప్రియాన్ష్ కు జతగా మరో శతక వీరుడు ఆయుష్ బదోని (165) సైతం బౌండరీల మోత మోగించాడు. అతడు అయితే 8 ఫోర్లు, 19 సిక్సర్లతో స్ట్రైకర్స్ బౌలర్లను చీల్చి చెండాడాడు.

https://www.youtube.com/shorts/DlqIG_Ci5hM

Read more RELATED
Recommended to you

Latest news