MEA’s కి డీజీ లాకర్ ని లాంచ్ చేసారు…! వివరాలు ఇవే…!

-

డిజి లాకర్ సదుపాయం గురించి యూనియన్ మినిస్టర్ వి మురళీధరన్ శుక్రవారం నాడు చెప్పారు. మినిష్టర్ ఆఫ్ ఎక్స్టెర్నల్ అఫైర్స్ కి డీజీ లాకర్ ని లాంచ్ చెయ్యడం జరిగింది.  పాస్ పోర్ట్ సేవా ప్రోగ్రాం కి సంబంధించి దీనిని అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. దీనితో అవసరమైన డాక్యుమెంట్స్ ని పాస్ పోర్ట్ సర్వీసుల కోసం సబ్మిట్ చేయవచ్చు. దీని కోసం కాగితాలు అక్కర్లేదు. అలానే ఒరిజినల్ డాక్యుమెంట్ ని కూడా తీసుకురావక్కర్లేదు.

passportఈ సేవా ప్రోగ్రాం చాలా మార్పు తీసుకు వచ్చిందని ఆయన అన్నారు. గత ఆరు నెలలుగా ఎంతో మార్పు గమనించాను అని చెప్పడం జరిగింది. ప్రతినెల అప్లికేషన్స్ ఒక మిలియన్ మంది సబ్మిట్ చేస్తున్నారు అన్నారు. ఇది మొట్టమొదటి సారిగా 2017 లో జరిగింది. పాస్ పోర్ట్ సేవా ప్రాజెక్టు నుండి ఏడు కోట్ల పాస్ పోర్ట్స్ ఇష్యూ అయ్యాయని ఆయన చెప్పారు. ఎన్నో అవసరమైన పద్ధతుల్ని అనుసరించి రోజు రోజుకీ దానిని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

కేవలం ఇది మాత్రమే కాకుండా పాస్ పోర్ట్ రూల్స్ ని కూడా తగ్గించినట్లు ఆయన అన్నారు. డోర్ స్టెప్ పాస్ పోర్ట్ ఫెసిలిటీస్ ని కూడా అందిస్తున్నట్లు చెప్పడం జరిగింది. కేవలం పాస్ పోర్ట్ ఆఫీస్ లో మాత్రమే కాకుండా ఇప్పుడు ఏకంగా 426 పోస్ట్ ఆఫీస్ పాస్ పోర్ట్ కేంద్రాన్ని కూడా నడుపుతున్నట్టు చెప్పారు. ఇలా పబ్లిక్ కోసం 555 పాస్ పోర్ట్ ఆఫీసుల్లో ఉన్నట్లు చెప్పారు.

పేపర్ లెస్ మోడ్ ని కూడా ప్రజలకి కల్పించడంలో సక్సెస్ అయ్యారు. ప్రభుత్వం అందించిన డీజీ లోకల్ ప్లాట్ఫామ్ కూడా ప్రజలు బాగా ఉపయోగిస్తున్నారని అన్నారు. ఇప్పుడు దీని ద్వారా డాక్యుమెంట్స్ ని పొందుపరచడం తో పాటు పాస్ పోర్ట్ ను కూడా దీనిలో చేర్చనున్నారు. అయితే ఇది కూడా ప్రజలకు బాగా ఉపయోగ పడుతుంది. ఒకవేళ పాస్ పోర్ట్ పోగొట్టుకున్న తిరిగి ఈ ఫెసిలిటీ ద్వారా పొందొచ్చు. ఇది ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

అలానే ఎలక్ట్రానిక్ పాస్ పోర్ట్ ని తీసుకు రావడం వల్ల సెక్యూరిటీని మరింత పెంపొందించవచ్చు ఫ్రాడ్ నుండి కూడా తప్పించవచ్చు. రానున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఆర్పీఏ మొదలైన వాటిని తీసుకొస్తున్నట్లు చెప్పారు. డిజి లాకర్ ఫెసిలిటీ వల్ల ఇంటి నుంచి దూరంగా ఉన్నా పాస్ పోర్ట్ కోసం వాళ్లు చూడక్కర్లేదు. అందుకే ఎక్కువగా దీనిని ఉపయోగించమని చెప్తున్నారు. దీనివల్ల చాలా బెనిఫిట్ కలుగుతోందని 150 ఇండియన్ మిషన్స్ ని ఫారం లో కూడా ప్రవేశపెట్టడం జరిగినట్లు ఆయన చెప్పడం జరిగింది. ప్రధాని మోడీ డిజిటల్ ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version