కోవిడ్ వ్యాక్సిన్ పేరిట ఆధార్ ఓటీపీ అడిగితే న‌మ్మొద్దు.. హెచ్చ‌రిక‌లు జారీ..

-

భార‌త ప్ర‌భుత్వం జ‌న‌వ‌రి 16వ తేదీ నుంచి అతి పెద్ద క‌రోనా వ్యాక్సిన్ పంపిణీ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వ ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేశారు. మొత్తం 16 ల‌క్ష‌ల మందికి పైగా టీకాల‌ను వేయించుకున్నారు. అయితే కోవిడ్ వ్యాక్సిన్ పేరు చెప్పి కొంద‌రు మోసాల‌కు పాల్పడుతున్నార‌ని, అలాంటి వారి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో (పీఐబీ) హెచ్చ‌రించింది.

తొలి ద‌శ‌లో 3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వారియ‌ర్ల‌కు టీకాల‌ను ఇవ్వాల‌ని కేంద్రం ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఆ త‌రువాత 50 ఏళ్ల‌కు పైబ‌డిన వారికి, దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి టీకాల‌ను ఇస్తారు. ఆ కార్య‌క్ర‌మం 2వ ద‌శ‌లో జ‌రుగుతుంది. దానికి గాను ల‌బ్ధిదారులు కోవిన్ అనే యాప్‌లో త‌మ ఐడీ, అడ్ర‌స్ ప్రూఫ్‌ల‌ను అంద‌జేసి మొబైల్ నంబ‌ర్‌తో రిజిస్ట‌ర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ యాప్ పేరు చెప్పి కొంద‌రు దుండ‌గులు మోసం చేస్తున్నారు.

త్వ‌ర‌లో కోవిడ్ టీకా వేస్తాం, మీ ఆధార్‌కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబ‌ర్‌కు ఓటీపీ వ‌చ్చింది, చెప్పండి అంటూ.. కొంద‌రు మోసం చేస్తున్నారు. నిజానికి అలా జ‌ర‌గ‌దు. ఎవ‌రూ ఆధార్ ఓటీపీని అడ‌గ‌రు. రెండో ద‌శ వ్యాక్సినేష‌న్ మొద‌లైతే మ‌న‌మే స్వ‌యంగా ఆధార్ వంటి ప‌త్రాల‌తో కోవిన్ యాప్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అంతేకానీ ప్ర‌భుత్వానికి చెందిన వారు రిజిస్ట‌ర్ చేయ‌రు. క‌నుక ఇలా ఆధార్ ఓటీపీ అడుగుతూ వ‌చ్చే ఫోన్ కాల్స్‌ను, అలా కాల్స్ చేసే వ్య‌క్తుల‌ను న‌మ్మ‌కూడ‌దని పీఐబీ హెచ్చ‌రించింది. ఈ మేర‌కు పీఐబీ ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version