Fact Check: ఉదంపూర్‌, బార్మర్‌లో పాకిస్థాన్ డ్రోన్స్ దాడులు… క్లారిటీ ఇదే !

-

భారత్‌పై మరోసారి పాక్ దాడి చేసిందని వార్తలు వస్తున్నాయి. సీజ్ ఫైర్ నిబంధనలను ఉల్లంఘించి మరోసారి డ్రోన్ దాడులకు పాకిస్థాన్ తెగబడిందని చెబుతున్నారు. ఆదివారం రాజస్థాన్-బర్మార్‌లో డ్రోన్లు కనిపించినట్టు ట్వీట్ చేసింది జిల్లా యంత్రాంగం. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, స్థానికంగా బ్లాక్ అవుట్ విధించినట్టు వెల్లడించినట్లు సమాచారం.

Drone activity spotted in Barmer, residents asked to stay indoors and observe blackout
Drone activity spotted in Barmer, residents asked to stay indoors and observe blackout

స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ.. భారత్‌పై పాకిస్థాన్ మరోసారి దాడి చేసిందా? అనే ప్రశ్న కూడా తలెత్తింది. జమ్ముకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో డ్రోన్స్ కనిపించాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఉదంపూర్‌లో భారీ పేలుళ్లు జరిగాయని, బార్మర్‌లోనూ డ్రోన్స్ దాడి జరిగిందని పోస్టులు పెడుతున్నారు. కానీ.. వీటిల్లో ఏదీ వాస్తవం కాదని, ఎక్కడా దాడులు జరగలేదని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. గందరగోళ వాతావరణం సృష్టించడం కోసమే.. ఈ పుకార్లను సృష్టిస్తున్నారని క్లారిటీ ఇచ్చింది. అటు.. బార్మర్‌లో కూడా డ్రోన్స్ దాడులు జరగలేదని క్లారిటీ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news