తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలెర్ట్. తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దింతో తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. . ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వర్షం పడనుంది.

ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక అటు ఏపీలో పెరుగుతున్న వడగాలుల ప్రభావం ఉంది. 144 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. నేడు 70 మండలాల్లో వడగాలులు వీచే ఛాన్స్ ఉందని, వాతావరణ శాఖ హెచ్చరించింది.