మేఘాలయలో మళ్లీ భూకంపం సంభవించింది. మేఘాలయలోని తూర్పు గారో హిల్స్ ప్రాంతంలో నిన్న అంటే ఏప్రిల్ 17 రాత్రి 11:20 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 2.7గా నమోదైందని నేషనల్ సీస్మోలాజికల్ సెంటర్ నివేదించింది.

10 కి. మీ లోతులో 25.60 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 90.59 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద భష్ట్రకంప కేంద్రాన్ని గుర్తించారు. 16వ తేదీన కూడా ఇదే ప్రాంతంలో భూకంపం సంభవించడం గమనార్హం.
కాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, అల్లూరి, మన్యం జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. మరోవైపు అల్లూరి జిల్లా కూనవరం, చింతూరు మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచే ప్రభావం ఉందని వెల్లడించింది.