హైదరాబాద్ నగరంలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి పెళ్ళికి ఒప్పుకోవడం లేదని యువతీ సూసైడ్ చేసుకుంది. బిల్డింగ్ పై నుండి దూకి సుల్తానా బేగం (26) ఆత్మహత్య చేసుకుంది. రాయదుర్గం పీఎస్ పరిధిలోని అంజయ్య నగర్ లో ఈ ఘటన జరిగింది.గచ్చిబౌలి లోని అంతేరా హోటల్ లో పనిచేస్తున్నారు సుల్తానా బేగం.

సాహిదూల్ సేఖ్ తో మూడు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు సుల్తానాబేగం. అయితే, కొన్ని రోజుల నుంచి సాహిదూల్ సేఖ్ ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు సుల్తానా బేగం. ఇక సేఖ్ పెళ్ళికి ఒప్పుకోక పోవడం తో అతను ఉంటున్న రూమ్ బిల్డింగ్ పైకి వెళ్లి దూకి బలవన్మరణానికి పాల్పడింది సుల్తానా బేగం. ఇక ప్రేమించిన వ్యక్తి పెళ్ళికి ఒప్పుకోవడం లేదని యువతీ సూసైడ్ చేసుకున్న ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.