నేడు జపాన్ లో పలు కంపెనీలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు నిర్వహిచనున్నారు. భారత రాయబార కార్యాలయంలో పరిశ్రమల ప్రతినిధులతో భేటికానున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. టయోటా, తోషిబా, ఏసిస్, ఎన్టీటీ కంపెనీల సీఈఓలతో చర్చలు నిర్వహిచనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

టోక్యోలోని గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించనున్నారు రేవంత్ రెడ్డి. అనంతరం టోక్యో ప్రభుత్వంతో భేటికానుంది రేవంత్ రెడ్డి బృందం. ఇక అటు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సందేశం ఇచ్చారు. యేసు క్రీస్తు త్యాగాన్ని, ధైర్యాన్ని గుర్తు చేసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. యేసు ప్రభు ప్రేమ, కృప కటాక్షాలు ఎప్పుడూ ప్రజలపై ఉండాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. శాంతి, కరుణ సందేశాలతో పాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదరభావం ఇప్పటికీ ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పారు.