12 కిలోల బాహుబలి సమోసా తినండి.. రూ.71 వేలు గెలుచుకోండి

-

వంటలు చేయడంలో దిట్ట అయిన వాళ్లు ఎప్పుడు కొత్తకొత్త వెరైటీలు ట్రై చేస్తారు. అలాగే యూపీలోని మేరఠ్​లో లాల్​కుర్తీ ప్రాంతానికి చెందిన కౌశల్ స్వీట్స్ యజమాని శుభమ్ కౌశల్ కూడా కొత్తగా ఏదైనా ట్రై చేద్దామనుకున్నాడు. తమ షాపులోని సమోసాలకు గుర్తింపు వచ్చేలా ప్రయత్నిద్దామనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఓ మంచి ఆలోచన తట్టింతి శుభమ్​కు. అంతే మొదట 4 కిలోలు.. తర్వాత 8 కిలోల సమోసాలు తయారు చేయించాడు. వీటికి ప్రజాదరణ బాగుండటంతో ఈసారి 12 కిలోల సమోసా తయారు చేయించాడు. దానికి బాహుబలి సమోసా అని పేరు పెట్టాడు.

ఈ సమోసాను ముగ్గురు వంట మనుషులు ఆరు గంటలు శ్రమించి తయారుచేశారు. ఈ సమోసాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఆర్డర్లు కూడా బాగానే వస్తున్నాయి. రూ.1,500 ధరగా నిర్ణయించిన 12 కిలోల సమోసాలకు ఇప్పటివరకు దాదాపు 40 నుంచి 50 ‘పుట్టినరోజు’ ఆర్డర్లు వచ్చాయని కౌశల్‌ తెలిపారు. అంతేకాదు.. ఈ సమోసాను అరగంటలో ఆరగిస్తే రూ.71,000 నగదు మీదే అంటూ ఈయన బహుమతి కూడా పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news