దిల్లీ లిక్కర్ స్కామ్​లో రూ.623 కోట్ల అవినీతి : ఈడీ

-

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ వ్యవహారంలో రూ.623 కోట్ల అవినీతి వెలుగుచూసినట్లు ఈడీ పేర్కొంది. ముడుపులు తీసుకొని దిల్లీ మద్యం విధానాన్ని ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా తయారు చేసిన వ్యవహారంలో భారీ స్కామ్​ జరిగినట్లు తేల్చింది. ఇందులో దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోదియాను 29వ నిందితుడిగా చేరుస్తూ మే 4న దాఖలుచేసిన 4వ ఛార్జిషీట్‌లో ఈ అంశాన్ని పేర్కొంది. దీన్ని మంగళవారం రౌస్‌ ఎవెన్యూ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకొంది.

సౌత్‌గ్రూప్‌ ముడుపుల కింద ఇచ్చిన రూ.100 కోట్లలో రూ.31 కోట్లను హైదరాబాద్‌ నుంచి హవాలాలో తరలించినట్లు పేర్కొంది. దిల్లీ బెంగాలీ మార్కెట్‌లోని బ్రోకర్ల ద్వారా ఈ వ్యవహారం నడిపినట్లు తెలిపింది. హవాలా కోసం ఉపయోగించిన రూ.50, రూ.20 నోట్లను ఈడీ ఛార్జిషీట్‌లో పొందుపరిచింది. 49 మంది నిందితులు, సాక్షుల వాంగ్మూలాలను జతచేసింది. మొత్తం వ్యవహారంలో మనీష్‌ సిసోదియానే కీలకపాత్ర పోషించినట్లు ఈడీ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news