బైజూస్‌ సీఈవో ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

-

ప్రముఖ ఎడ్యుటెక్‌ సంస్థ బైజూస్‌ సీఈవో రవీంద్రన్‌ బైజు ఇల్లు, కార్యాలయాలపై ఈడీ దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆయన కంపెనీ థింక్‌ అండ్‌ లెర్న్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కార్యాలయాల్లో ఈడీ అధికారులు ఇవాళ సోదాలు చేస్తున్నారు. మొత్తం మూడు ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు జరిపింది. ఫెమా చట్టం కింద నమోదైన కేసులో భాగంగా ఈ సోదాలు చేపట్టినట్లు ఈడీ వెల్లడించింది. ఈ తనిఖీల్లో పలు డాక్యుమెంట్లు, డిజిటల్‌ డేటాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

థింక్‌ అండ్‌ లెర్న్‌ ప్రైవేటు లిమిటెడ్‌.. బైజూస్‌ పేరుతో ఆన్‌లైన్‌ విద్యా కోర్సులను అందిస్తోన్న విషయం తెలిసిందే. ‘‘ 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ కంపెనీ ఆర్థిక లావాదేవీలను వెల్లడించలేదు. ఖాతాలను ఆడిటింగ్‌ చేయించలేదు’’ అని ఈడీ తన ప్రకటనలో పేర్కొంది.

అయితే ఇందులో అవకతవకలు జరిగాయని, ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి ఈ నిధులను స్వీకరించినట్లు ప్రైవేటు వ్యక్తుల నుంచి ఫిర్యాదులు అందాయని ఈడీ వెల్లడించింది. దీనిపై పలుమార్లు రవీంద్రన్‌కు సమన్లు జారీ చేసిప్పటికీ ఆయన విచారణకు హాజరుకాలేదని పేర్కొంది. దీంతో నేడు ఆయన ఇల్లు, రెండు ఆఫీసుల్లో సోదాలు జరిపినట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version