జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు ఊహించని షాక్ ఇచ్చింది ఈడీ బృందం. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు సంబంధించిన బిఎండబ్ల్యూ కారును ఈడి అధికారులు సీజ్ చేశారు. ఢిల్లీలోని సోరెన్ నివాసంలో ఈ కారును స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నిధులతో ఈ కారును కోన్నట్లు ఈడి అధికారులు గుర్తించి సీజ్ చేశారు.
కాగా, మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడి ఇప్పటి వరకు సోరెన్ కు ఏడుసార్లు నోటీసులు పంపింది. ఒక్కసారి కూడా ఆయన విచారణకు హాజరుకాలేదు. దీనిపై సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. నోటీసులు ఇచ్చేందుకు ఇంటికి వెళ్లితే.. కనిపించడం లేదు.. జార్ఖండ్ సీఎంను వెతికి పెట్టండి అని పేర్కొనడంతో ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారింది.