నా మనసు చెప్పింది చేశా…మూడో పెళ్లిపై షోయబ్ మాలిక్ సంచలనం

-

Shoaib Malik About His Third Marriage : పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తన మూడో పెళ్లిపై కీలక వాక్యాలు చేశారు. ‘మీ మనసు ఏది చెబితే అదే చేయాలి. ప్రజలు ఏమనుకుంటారో అని ఆలోచించకూడదు. జనాలను అర్థం చేసుకోవడానికి 10 లేదా 20 ఏళ్లు పడుతుంది.

Shoaib Malik About His Third Marriage

అప్పటివరకు ఏ పనులు చేయకుండా ఉండలేము కదా’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా మాలిక్ ఇటీవల సనా జావేద్ ను మూడో పెళ్లి చేసుకున్నారు. దీంతో ఆటు పాక్, ఇటు భారత్ లో కూడా అతనిపై విమర్శలు ఎక్కువయ్యాయి.

కాగా పాకిస్తాన్‌ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు షోయబ్ మాలిక్. గతేడాది ఆగస్టు 20వ తేదీన షోయబ్ మరియు సనా ఇద్దరూ పెళ్లి చేసుకున్నప్పటికీ…తాజాగా ప్రకటించారు. అయితే… అంతకు ముందు 2022 సంవత్సరంలోనే అయేషా సిద్దిఖీని పాకిస్థాన్ క్రికెట్ స్టార్ షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు విడాకులు ఇచ్చి… 2010 లో సానియాను పెళ్లి చేసుకున్నాడు పాకిస్థాన్ క్రికెట్ స్టార్ షోయబ్ మాలిక్. ఇక ఇప్పుడు సానియాకు విడాకులు ఇచ్చి… పాకిస్తాన్‌ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news