భారత విద్యార్థులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌ రిపబ్లిక్‌ డే కానుక!

-

భారత గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్క వచ్చిన ఆయన ఇవాళ కీలక ప్రకటన చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా భారతీయ విద్యార్థులకు మెక్రాన్ శుభవార్త చెప్పారు. మరింత ఎక్కువ మంది భారత విద్యార్థులు ఫ్రాన్స్‌లో చదువుకునే దిశగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. 2030 నాటికి దాదాపు 30 వేల మంది విద్యార్థులను ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ సందర్భంగా మెక్రాన్ వెల్లడించారు.

అంతే కాకుండా భారత విద్యార్థులకు ఫ్రాన్స్‌ అందించే తోడ్పాటు గురించి కూడా వివరించారు. ఫ్రెంచ్ మాట్లాడలేని విద్యార్థుల కోసం విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేకంగా ‘అంతర్జాతీయ తరగతుల’ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వివిధ సంస్థల భాగస్వామ్యంతో ఒక నెట్‌వర్క్‌ను సృష్టిస్తామని.. ఫ్రాన్స్‌లో చదివిన పూర్వ విద్యార్థులకు వీసా సదుపాయం కల్పిస్తామని మెక్రాన్ వరాలు అందించారు. భారత్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం రోజున మెక్రాన్‌ ప్రత్యేక విమానంలో జైపుర్‌ నగరానికి చేరుకున్నారు. అక్కడి నుంచి దిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news