దేశంలోని ఉద్యోగులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (epfo) శుభ వార్త చెప్పింది. సంఘటిత రంగంలో ని కార్మికులకు కొత్త పింఛన్ పథకాన్ని తీసుకు వచ్చేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఆలోచన చేస్తోంది. నెలకి 15000 కంటే ఎక్కువ మూల వేతనం కోరుతూ…. 1995 ఉద్యోగుల పెన్షన్ పథకం పరిధిలో లేని వారికోసం ఈ పథకాన్ని వర్తింపజేయాలని యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం సంఘటిత రంగంలో.. ఉద్యోగంలో చేరి నాటికి నెలకు 15 వేల వరకు మూల వేతనం పొందే వారంతా ఈపిఎస్ 95 పరిధి లోకి వస్తున్నారు. “ఎక్కువ మొత్తం జమ చేస్తే.. ఎక్కువ పెన్షన్ పొందిన వీలు కల్పించాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త పెన్షన్ పథకాన్ని తెచ్చే అంశం పరిశీలనలో ఉంది” అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ కొత్త పెన్షన్ పథకం ప్రతిపాదనపై మార్చి 11, 12 తేదీల్లో గుహాటిలో నిర్వహించే సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.