వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ 20 లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో 3-0 తేడాతో సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసేసింది. దీంతో రికార్డుల మోత మోగిపోయింది. కెప్టెన్ గా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. పూర్తి కాలం కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. వచ్చిన వన్డే సిరీస్ ను, టీ 20 సిరీస్ ను వరుసగా క్లీన్ స్వీప్ చేశాడు. రోహిత్ శర్మ టీ 20 కెప్టెన్సీలో ఇది వరుసగా మూడో క్లీన్ స్లీప్ చేశాడు.
వెస్టిండీస్ జట్టునే రెండు సార్లు.. క్లీన్ స్వీప్ చేశాడు. అలాగే.. న్యూజీలాండ్ పై ఒక సారి టీ 20 సిరీస్ ను వైట్ వాష్ చేశాడు. దీంతో టీమిండియా ఐసీసీ టీ 20 ర్యాంకింగ్స్ లో అగ్ర స్థానం లోకి దూసుకుపోయింది. టీ 20లలో వరుస విజయాలు నమోదు చేయడంతో ఐసీసీ టీ 20 ర్యాంకింగ్స్ లో ఇప్పటి వరకు రెండో స్థానంలో భారత్.. ఇప్పుడు టాప్ ప్లేస్ కు చేరుకుంది. ప్రస్తుతం రెండో స్థానంలో ఇంగ్లాండ్ జట్టు ఉండగా.. మూడో స్థానంలో పాకిస్థాన్ ఉంది.