IND vs SA 1st T20I : భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. మొత్తం మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచకపోవడంతో దక్షిణాఫ్రికా బోర్డుపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్ని క్రికెట్ బోర్డుల దగ్గర పుష్కలం గా డబ్బు ఉందని అన్నారు. మైదానాన్ని కప్పి ఉంచడానికి కవర్లను కొనుగోలు చేయడానికి అవసరమైన డబ్బు ఉంటుందని….ఈ విషయంలో నిర్లక్ష్యం వద్దని చెప్పారు. కాగా నిన్న డర్బన్ వేదికగా జరుగాల్సిన భారత్-దక్షిణాఫ్రికా తొలి టీ-20 రద్దు అయింది. వర్షం వల్ల రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు అంపెర్లు. మంగళవారం అంటే రేపు భారత్-దక్షిణాఫ్రికా రెండో టీ-20 మ్యాచ్ జరుగంది. 14న చివరి టీ- 20 మ్యాచ్ జరుగంది.