నకిలీ సిబిఐ అధికారి శ్రీనివాస్ కి 14 రోజుల రిమాండ్

నకిలీ సిబిఐ అధికారి కొమ్మిరెడ్డి శ్రీనివాస్ ను నేడు సిబిఐ కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా అతనికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు పేర్కొంది. అయితే అతడిని కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోరగా అందుకు కోర్టు నిరాకరించింది. ఇప్పటికే నాలుగు రోజులపాటు కస్టడీకి ఇచ్చామని, మళ్లీ ఇవ్వడం కుదరదని పేర్కొంది.

ఈ క్రమంలో శ్రీనివాస్ ను తీహార్ జైలుకి తరలించాలని సూచించింది. శ్రీనివాస్ కేసులో ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్టేట్మెంట్ ని రికార్డు చేసింది సిబిఐ. శ్రీనివాస్ తో వారికి ఉన్న సంబంధాలపై సిబిఐ అధికారులు ఆరా తీశారు.