బెంగళూరు మెట్రోలో రైతుకు అవమానం

-

బెంగళూరు మెట్రోలో ఓ రైతుకు చేదు అనుభవం ఎదురైంది. మాసిన దుస్తులతో ఉన్నాడనే కారణంతో ఓ రైతును మెట్రో రైలులోకి అనుమతించలేదు.  దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అసలేం జరిగిందంటే..?

ఈనెల 24వ తేదీన మాసిన దుస్తులతో, నెత్తిన చిన్న మూటతో ఉన్న సోడ్రప్ప అనే రైతు మెట్రో రైలు ఎక్కేందుకు రాజాజీనగర స్టేషన్‌కు చేరుకోగా..  మాసిన దుస్తులతో మెట్రో ఎక్కితే ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని స్టేషన్‌ ఉద్యోగులు ఆయన్ను అడ్డుకున్నారు. టికెట్‌ తీసుకున్నానని రైతు చెప్పినా వారు వినకపోగా.. తోటి ప్రయాణికులు ఆ అన్నదాతకు మద్దతుగా నిలిచినా సిబ్బంది తీరులో మార్పు రాలేదు. ఆగ్రహించిన ఓ యువకుడు ఆ రైతు చేయిపట్టుకుని రైలెక్కడంతో కథ సుఖాంతమైంది. ఈ ఉదంతాన్ని ఓ ప్రయాణికుడు తన సెల్‌ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్ అయింది. కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి చెలువరాయస్వామి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.

Read more RELATED
Recommended to you

Latest news