ఫాస్టాగ్ యూజర్స్కు అలర్ట్. ఈనెల 31వ తేదీ వరకు మీ ఫాస్టాగ్కు కేవైసీ పూర్తి చేయని చేయలేదో మీ అకౌంటి డీయాక్టివేట్ లేదా బ్లాక్ అవ్వడం ఖాయం. ఫాస్టాగ్ ద్వారా టోల్ వసూళ్లను మరింత క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తోన్న కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది. ఫాస్టాగ్‌లను నిలుపుదల చేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ సిద్ధమైంది.
ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్ ఉన్నా.. కేవైసీ పూర్తి చేయకపోతే జనవరి 31, 2024 తర్వాత వాటిని బ్యాంకులు డీయాక్టివేట్/బ్లాక్‌లిస్ట్ చేస్తాయని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తెలిపింది. ఈ అసౌకర్యాన్ని నివారించేందుకు యూజర్లు తమ ఫాస్టాగ్‌లకు కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించింది. అదనపు సమాచారం కోసం సమీపంలోని టోల్‌ప్లాజాలు లేదా సంబంధిత బ్యాంకు కస్టమర్‌కేర్ నంబర్‌లను సంప్రదించాలని పేర్కొంది.
మరోవైపు వాహనదారులు ఒకే ఫాస్టాగ్‌ను అనేక వాహనాలకు ఉపయోగించడం, ఒకే వాహనానికి పలు ఫాస్టాగ్‌లను లింక్ చేస్తున్నట్లు, కొన్ని సందర్భాల్లో కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్టాగ్‌లు జారీ చేస్తున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ గుర్తించింది. ఇటువంటి వాటిని ప్రోత్సహించకుండా ఉండేందుకు ఒకే వాహనం-ఒకే ఫాస్టాగ్ విధానానికి చర్యలు చేపట్టింది.