ఇవాళ సాయంత్రం కేంద్ర కేబినెట్‌ తొలి భేటీ

-

భారత ప్రధానిగా మూడోసారి. నరేంద్ర దామోదర్‌ దాస్‌ మోదీ ఆదివారం సాయంత్రం ప్రమాణం చేశారు. 2014, 2019 ఎన్నికల్లో విజయం తర్వాత రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. తాజా ఎన్నికల్లో కూటమి గెలుపుతో వరసగా మూడోసారి పీఎం పీఠమెక్కి రికార్డు సృష్టించారు. రాష్ట్రపతి భవన్‌లో ఆహ్లాదభరిత వాతావరణంలో అట్టహాసంగా జరిగిన వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు.

ఏడు దేశాల అధినేతలు, భారత మాజీ రాష్ట్రపతులు, వివిధ రంగాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సినీతారలు, మత గురువులు, పారిశుద్ధ్య కార్మికులు, వందేభారత్‌ లోకోపైలట్లు సహా సమాజంలో వివిధ వర్గాలవారి సమక్షంలో మోదీ మరోసారి పట్టాభిషిక్తుడయ్యారు. మోదీతో పాటు 72 మంది కేంద్ర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో ఇవాళ తొలిసారి మోదీ జట్టు సమావేశం కాబోతోంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్‌ తొలి భేటీ జరగబోతోంది. ప్రమాణస్వీకారం తర్వాత తొలిసారిగా మంత్రివర్గం భేటీ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version