మోదీ 3.0 కేబినెట్లో 33 కొత్త ముఖాలు

-

మోదీ 3.0 కేబినెట్ ఆదివారం రోజున ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అందులో 33 మంది కొత్తవారు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వారిలో ఆరుగురికి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉండగా.. తొలిసారిగా కేంద్ర మంత్రివర్గంలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), మనోహర్ లాల్ ఖట్టర్ (హరియాణా), హెచ్‌డీ కుమారస్వామి (కర్ణాటక) చేరారు. కొత్తగా కేబినెట్లో చేరిన వారిలో బీజేపీ మిత్రపక్షాలకు చెందిన ఏడుగురు నేతలు ఉండగా.. తెలంగాణ నుంచి బండి సంజయ్ కుమార్ ఏపీలో బీజేపీ నుంచి భూపతి రాజు శ్రీనివాస వర్మ, టీడీపీ నుంచి కె రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్ పెమ్మసాని తొలిసారిగా కేంద్ర మంత్రివర్గంలో చేరారు.

బీజేపీ నుంచి తొలిసారి

శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), మనోహర్ లాల్ ఖట్టర్ (హరియాణా), కమలేష్ పాశ్వాన్ (ఉత్తర్ప్రదేశ్), రవ్‌నీత్ సింగ్ బిట్టు (పంజాబ్), రక్షా ఖడ్సే (మహారాష్ట్ర), సురేష్ గోపి (కేరళ), సుకాంత మజుందార్ (బంగాల్), దుర్గా దాస్ ఉకే (మధ్యప్రదేశ్), రాజ్ భూషణ్ చౌదరి (బిహార్), సతీష్ దూబే (బిహార్), సంజయ్ సేథ్ (ఝార్ఖండ్), సీఆర్ పాటిల్ (గుజరాత్), భగీరథ్ చౌదరి (రాజస్థాన్), హర్ష్ మల్హోత్రా (దిల్లీ), వి సోమన్న (కర్ణాటక), సావిత్రి ఠాకూర్ (మధ్యప్రదేశ్), ప్రతాప్రావు జాదవ్ (మహారాష్ట్ర), జార్జ్ కురియన్ (కేరళ), కీర్తి వర్ధన్ సింగ్ (ఉత్తర్ప్రదేశ్), భూపతి రాజు శ్రీనివాస వర్మ (ఆంధ్రప్రదేశ్), నిముబెన్ బాంబ్నియా (గుజరాత్), మురళీధర్ మోహోల్ (మహారాష్ట్ర), పబిత్రా మార్గరీట (అసోం), బండి సంజయ్ కుమార్ ( తెలంగాణ)

బీజేపీ మిత్ర పక్షాల నుంచి తొలిసారి

కె రామ్మోహన్ నాయుడు (టీడీపీ), చంద్రశేఖర్ పెమ్మసాని (టీడీపీ), లాలన్ సింగ్ (జేడీయూ), రామ్నాథ్ ఠాకూర్ (జేడీయూ), జయంత్ చౌదరి(ఆర్ఎల్డీ), చిరాగ్ పాసవాన్ (ఎల్జేపీ), హెచ్డీ కుమారస్వామి (జేడీ(ఎస్))

Read more RELATED
Recommended to you

Exit mobile version