పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సిగ్గుంటే మీసం తీసేయాలంటూ సవాల్ విసిరారు ఎమ్మెల్యే ఆదిమూలం. ఇవాళ ఎమ్మెల్యే ఆదిమూలం మీడియాతో మాట్లాడుతూ… సత్యవేడు నియోజకవర్గంలోని వనరులను దోచుకోవడానికి నన్ను ఓడగోట్టాలనుకున్నారన్నారు ఎమ్మెల్యే ఆదిమూలం. నన్ను ఓడిస్తాను అంటూ సవాల్ చేసిన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సిగ్గుంటే మీసం తీసేయాలని డిమాండ్ చేశారు.
నీతి నిజాయితీ ధర్మానికి సత్యవేడు నియోజకవర్గం ప్రజలు ఓటు వేశారని కొనియాడారు ఎమ్మెల్యే ఆదిమూలం..రాజకీయాలు చాలించుకోవాలనుకున్న కానీ నియోజకవర్గాన్ని కబ్జాకోరు దగాకోరు లూటీ కోర్లతో కాపాడాలని బరిలో దిగానని స్పష్టం చేశారు. అష్ట కష్టాలు పెట్టిన తట్టుకొని నిలబడ్డానని చెప్పారు ఎమ్మెల్యే ఆదిమూలం.
ఓడిపోయిన వారిని బయట వ్యక్తులను తీసుకుని వచ్చి నాకు పోటీగా నిలబెట్టారు…ఎట్టి పరిస్థితుల్లో ఆదిమూలం గెలవకూడదని శాయశక్తుల ప్రయత్నాలు చేశారని ఆరోపణలు చేశారు. కానీ ప్రజలు ధర్మం వైపు నిలబడి గెలిపించారని వెల్లడించారు ఎమ్మెల్యే ఆదిమూలం.