పండుగ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ అదిరే ఆఫర్స్ ని తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్స్ ని వినియోగించుకోవడం వలన మీరు తక్కువ ధరకే నచ్చినవి కొనుగోలు చేసి మీ డబ్బులని సేవ్ చేసుకోచ్చు. ఇది ఇలా ఉంటే బిగ్ బిలియన్ డేస్ తర్వాత దేశీ దిగ్గజ ఈ కామర్స్ సంస్థల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్ మరో అదిరిపోయే సేల్ తో కస్టమర్ల ముందుకు రావడం జరిగింది.
ఫ్లిప్‌కార్ట్ తాజాగా దీపావళి సేల్ ప్రకటించింది. బిగ్ దీపావళి సేల్‌లో భాగంగా ఏకంగా 80 శాతం వరకు తగ్గింపుని పొందొచ్చు. ఇక ఈ ఆఫర్స్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. మొబైల్స్, ట్యాబ్లెట్స్, టీవీ ఇతర ఎలక్ట్రానిక్స్ పై తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ అక్టోబర్ 17న స్టార్ట్ అవుతుంది.
అక్టోబర్ 23 వరకు ఈ ఆఫర్స్ అందుబాటులో వుంటారు. అదే ప్లస్ వాళ్లకి అయితే 16నే ఈ సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఆఫర్ లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు, ఎస్‌బీఐ యోనో కస్టమర్లకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈఎంఐ ట్రాన్సాక్షన్లకు కూడా ఆఫర్ వర్తిస్తుంది. అదే విధంగా మొబైల్స్ అండ్ ట్యాబ్లెట్స్‌పై 80 శాతం వరకు తగ్గింపు ఉంది.
ఎలక్ట్రానిక్స్ అండ్ యాక్ససిరీస్‌పై కూడా ఇలానే తగ్గింపు లభిస్తోంది. టీవీలు, ఇతర అప్లయెన్సెస్‌పై 75 శాతం వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఫ్యాషన్ బ్రాండ్లపై 60 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. అలానే బై మోర్ సేవ్ మోర్, టైమ్ బాంబ్ డీల్స్, రష్ అవర్స్, క్రేజీ డీల్స్ వంటివి పొందొచ్చు.