Satyapal Malik : భారతదేశం మరో గొప్ప వ్యక్తిని కోల్పోయింది. అత్యున్నత పదవులు అనుభవించిన జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మృతి చెందారు. 79 సంవత్సరాల మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కాసేపటి క్రితమే కన్నుమూశారు.

గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన… న్యూఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో మృతి చెందడం జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇది ఇలా ఉండగా 2019లో ఆర్టికల్ 370 ఎత్తేసిన సమయంలో సత్య పాల్ మాలిక్.. జమ్ము కాశ్మీర్ గవర్నర్ గా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే బీహార్, గోవా అటు మేఘాలయ గవర్నర్గా కూడా సత్యపాల్ మాలిక్ పనిచేశారు.