మరికాసేపట్లో హైదరాబాదులోని పలు ప్రాంతాలలో భారీగా వర్షం కురుస్తుందని జిహెచ్ఎంసి అధికారులు స్పష్టం చేశారు. రాబోయే మరో రెండు గంటల్లో హైదరాబాద్ లోని కూకట్పల్లి, అల్వాల్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, మణికొండ, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్,
మాదాపూర్ లాంటి పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి.

జిహెచ్ఎంసి పరిధిలో 20mm వరకు వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేశారు. మరోవైపు నిన్న తెలంగాణలోని పలు ప్రాంతాలలో విపరీతంగా వర్షాలు కురిసాయి. రోడ్లన్నీ నీటితో జలమయమయ్యాయి. హైదరాబాదు లాంటి మహానగరాలలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.