అరె ఏంట్రా ఇది.. పెళ్లి కొడుకు టైమ్ కు రాలేదని బావతో ఉత్తుత్తి పెళ్లి

-

వివాహ వేడుకకు సమయానికి వరుడు రాలేదని వధువు తన బావను పెళ్లి చేసుకుంది. ఈ సంఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఝూన్సీలో చోటుచేసుకుంది. అయితే అది నకిలీ పెళ్లి అని తెలిసి అందరూ షాక్ అయ్యారు. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఝాన్సీలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల వేదికగా సీఎం సామూహిక వివాహ కార్యక్రమం జరిగింది. ఇందులో 132 జంటలకు పెళ్లిళ్లు జరిగాయి. ఇందులో పాల్గొనేందుకు ఝాన్సీ సమీప బామౌర్‌కు చెందిన ఖుషీ వివాహం మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్‌కు చెందిన వృష్‌ భాను జంట కూడా వచ్చింది. వీరిద్దరి పేరుతో 36 నంబరు రిజిస్ట్రేషను నమోదైంది. అయితే పెళ్లి ముహూర్తం సమయానికి వరుడు రాకపోవడంతో  పెళ్లిపీటలపై ఖుషీ పక్కన వరుడిగా మరో వ్యక్తి కూర్చొన్నాడు.

ఆరా తీయగా.. పెళ్లికుమారుడు వేళకు రాలేదని, పెద్దల సలహాతో తాను కూర్చొన్నట్లు నకిలీ వరుడు చెప్పాడు. అతడికి ఇదివరకే పెళ్లి అయ్యిందని, ఖుషీకి వరుసకు బావ అవుతాడని సమాచారం. సామూహిక వివాహ పథకం కింద కొత్తజంటలకు యూపీ ప్రభుత్వం రూ.51 వేలు చొప్పున ఇస్తోంది. ఈ ప్రయోజనాలు పొందేందుకే అలా చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కూడా ఉందనే ఆరోపణలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version