40 వ ఎక్జిక్యూటివ్ మీటింగ్ లో ముఖ్యమైన అంశాలు…!

-

మినిస్టరీస్ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ డాక్టర్ ఆర్పి నిశాంత్ 40 వ మీటింగ్ కి హాజరు అయ్యారు. నవోదయ ఎగ్జిక్యూటివ్ కమిటీ విద్యాలయ సమితి కొన్ని విషయాల పై చర్చించడం జరిగింది. వీటిలో ముఖ్యమైన అంశాల కోసం ఇప్పుడు చూద్దాం. నార్త్ ఈస్ట్ హిమాలయన్ ప్రాంతాలు మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్లకి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ని నిర్వహించాలని అన్నారు. అలానే తొమ్మిదో తరగతి నుండి విద్యార్థులకు టాబ్లెట్స్ ని అందించాలని అన్నారు.

ఆరో తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఉచితంగా టెక్స్ట్ బుక్స్ ని ఇవ్వాలని అన్నారు. తరువాత సంవత్సరం నుంచి కొత్త ట్రాన్స్ఫర్ పాలసీని తీసుకొస్తున్నట్లు చెప్పారు మరియు ఇంజినీరింగ్ క్యాడర్ కోసం రిక్రూట్మెంట్ నిబంధనలను సవరించబడతాయి అని అన్నారు. ఇదిలా ఉండగా హాస్టల్ మరియు పాఠశాలలను మెరుగు పరచడానికి సీఎస్ఆర్ నిధులుని సమీకరించాలని చెప్పారు.

పూర్వ విద్యార్థులు పాఠశాలలను ఎడాప్ట్ చేసుకోవాలని అన్నారు. మినిస్టర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంజయ్ దొత్రే ఎంపీ కూడా మీటింగ్ కి అటెండ్ అయ్యారు. పాఠశాల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మెరుగు పరచాలని ఆయన చెప్పారు. కోవిడ్ భద్రత మరియు కొన్ని జాగ్రత్తలు పాటించాలని అన్నారు డిజిటల్ ఎడ్యుకేషన్ ని పరిశీలించి మరింత అభివృద్ధి చేయాలని ఆయన చెప్పడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version