ముఖేష్ అంబాని ఇంటి వద్ద పేలుడు పదార్ధాలు, కారులో ఏముంది…?

-

ముంబైలో అలజడి రేగింది. వ్యాపార దిగ్గజం, రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబాని ఇంటి వద్ద పేలుడు పదార్ధాలు కలకలం రేపాయి. ముంబైలోని ముఖేష్ అంబానీ నివాసం ఆంటిలియా వెలుపల 20 జెలటిన్ స్టిక్స్ తో కూడిన అనుమానాస్పద ఎస్‌యూవీ వాహనాన్ని గుర్తించారు. పెడ్దార్ రహదారిలోని ప్రసిద్ధ యాంటిలియా సమీపంలో స్కార్పియో కనపడింది.

mukesh-ambani

అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు ఈ వాహనాన్ని వదిలేసారు. గురువారం సాయంత్రం అంబానీ నివాసం వద్ద ఉన్న భద్రతా సిబ్బంది వాహనాన్ని గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికక్కడే బాంబ్ స్క్వాడ్‌ను కూడా పిలిచారు. వాహనాన్ని పరిశీలించిన తరువాత, దాని లోపల 20 జెలటిన్ స్టిక్స్ ఉన్నాయని గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులపై గామ్‌దేవి పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు ముంబై పోలీసు ప్రతినిధి ఒకరు మీడియాకు వివరించారు. భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 286 (పేలుడు పదార్థానికి సంబంధించి నిర్లక్ష్యంగా ప్రవర్తించడం), 465 (ఫోర్జరీకి శిక్ష), 473 (నకిలీ ముద్ర తయారు చేయడం లేదా కలిగి ఉండటం), 506 (2) (క్రిమినల్ బెదిరింపు, బెదిరింపులకు కారణమైతే) ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version