నేటి నుంచే ఆసియా కప్ పోరు ప్రారంభం కానుంది. టీమిండియా ప్లేయర్లు ఆసియాకప్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. గత ఆరు రోజులుగా బెంగళూరు శివారులోని ఆలూర్ క్యాంప్ లో నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లలో 17 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. శిక్షణ శిబిరం నిన్నటితోనే ముగిసింది. ఇక ఇవాళ భారత జట్టు.. శ్రీలంక కు బయలుదేరనుంది.
అయితే ఆసియా కప్-2023తో డిస్నీ హాట్ స్టార్ కు రూ. 350 కోట్ల నుంచి రూ. 400 కోట్ల వరకు యాడ్ రెవెన్యూ రానుంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం 10 సెకన్ల యాడ్ కాస్ట్ రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ కాకుండా ఇతర జట్టు ఆడే మ్యాచ్ లకు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలు మాత్రమే ఉన్నట్లు సమాచారం. దీన్ని బట్టి భారత్-పాక్ మ్యాచ్ కు ఎంత క్రేజ్ ఉందో తెలుస్తోంది. టోర్నీని ఫ్రీగా వీక్షించవచ్చు.