దేశంలోని సామాన్యులకు మరో దిమ్మ తిరిగే షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర ఏకంగా మూడున్నర రూపాయలు పెరిగింది. అలాగే 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర ఎనిమిది రూపాయలు పెరిగింది.
ధరల సవరణ నేపద్యంలో వంటగ్యాస్ సిలిండర్ ధరలను పెంచినట్లు ఆయిల్ కంపెనీలు పేర్కొంటున్నాయి. ఇక ఇవాళ పెరిగిన సిలిండర్ ధరలు ఇవాల్టి నుంచి అమలు చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాయి.
ఇప్పటికే డొమెస్టిక్ ఎల్పీజీ ధర వెయ్యి రూపాయలు దాటిన సంగతి తెలిసిందే. ఈ నెలలో రేట్లు పెంచడం ఇది రెండో సారి కావడం విశేషం. గత సంవత్సరం సిలిండర్ ధర 809 రూపాయలు ఉండగా ఈ ఒక్క ఏడాదిలో 200 రూపాయలు పెరిగింది.