ఢిల్లీ వరదలపై గౌతమ్ గంభీర్ సీరియస్ అయ్యారు. దేశ రాజధాని దిల్లీలో నిన్నటిదాక యమునా నది మహోగ్రరూపం దాల్చి ప్రజలను భయకంపితులను చేసిన విషయం తెలిసిందే. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి యమున కాస్త శాంతించింది. ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తోన్న యమునా నది నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది.
ఇటు యమునా ప్రవాహం తగ్గినా.. దిల్లీ వాసులు ఇంకా వరదల్లోనే చిక్కుకున్నారు. ఇక ఈ వరదలపై గంభీర్ సీరియస్ అయ్యారు. ఆప్ ప్రభుత్వ అసమర్థత వల్లే దేశ రాజధాని ఢిల్లీలో వరదలు వచ్చాయని బిజెపి ఎంపీ గౌతమ్ కమిటీ విమర్శించారు. ‘ఢిల్లీలో వరదలు రావడం దురదృష్టకరం. ఇది నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ప్రస్తుత ప్రభుత్వం నగర మౌలిక సదుపాయాల కల్పనపై ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయట్లేదు. ఢిల్లీని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం హామీ ఇచ్చాడు. కానీ ఏమి చేయట్లేదు’ అని మండిపడ్డారు.