బాయ్​ఫ్రెండ్​తో ఏకాంతం కోసం ఊళ్లో రోజూ కరెంట్‌ కట్‌.. ఏం ఐడియా గురూ

-

ప్రియుడితో ఏకాంతంగా గడిపేందుకు ఓ యువతి ఏకంగా తన ఊరిని ప్రతిరోజు అంధకారంలో ఉంచేది. ప్రతిరోజూ రాత్రిపూట ఒకే సమయంలో కరెంట్ పోవడం గమనించిన గ్రామస్థులు పక్కా ప్లాన్​తో అసలు సంగతి తెలుసుకుని కంగుతిన్నారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే..?

బిహార్‌ రాష్ట్రంలోని బేతియా జిల్లా నౌతన్‌ పోలీస్‌స్టేషను పరిధిలోని ఓ గ్రామంలో రోజూ రాత్రిపూట ఒకే సమయంలో కరెంట్ పోయేది. గత కొంతకాలంగా ఇలా గ్రామం మొత్తం కరెంట్ పోయి.. ఆ సమయంలో రెండు బైక్‌లు, కరెంట్‌ మోటార్లు, పలు మేకలు అపహరణకు గురయ్యాయి. ప్రతిరోజూ ఒకే సమయంలో అది కూడా కాసేపే విద్యుత్ సరఫరా నిలిచిపోవడం.. అదే సమయంలో చోరీలు జరగుతుండటంతో అనుమానం వచ్చిన గ్రామస్థులు మాటు వేసి వాళ్లను పట్టుకున్నారు. కానీ అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు.

గ్రామంలోని ఓ యువతి నిర్వాకమిదని తెలిసిపోయి గ్రామస్థులు షాక్ అయ్యారు. ఆమె రోజూ తన ప్రియుణ్ని కలుసుకునేందుకు రాత్రిపూట ట్రాన్స్‌ఫార్మరు వద్దకు వెళ్లి విద్యుత్తు సరఫరాను నిలిపివేసేది. ఇలా ఏకాంతంలో మునిగి తేలుతున్న ప్రేమికులను గ్రామస్థులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. యువకుడికి కొందరు దేహశుద్ధి కూడా చేశారు. పోలీసుల జోక్యంతో ఈ ప్రేమజంట పెళ్లికి పెద్దలు అంగీకరించడంతో ‘కరెంటు’ కథ సుఖాంతమైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version