భారత్-పాక్ పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్ లభించింది. పల్లెకేలేలో తెల్లవారుజాము నుంచి వర్షం దంచి కొట్టగా ప్రస్తుతం గ్యాప్ ఇచ్చింది. అయితే స్టేడియం పరిసర ప్రాంతాలను మేఘాలు కమ్ముకున్నాయి. మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం కానుండగా… ఆ తర్వాత కూడా వర్షం పడే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, సియా కప్ 2023 లో భాగంగా.. ఇవాళ శ్రీలంకలోని పల్లెకేలె వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇక ఇప్పటికే రెండు జట్లు ఈ పోరుకు సిద్ధమయ్యాయి. మొదట టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది.
జట్ల అంచనా
భారత్ : 1 రోహిత్ శర్మ (కెప్టెన్), 2 శుభ్మన్ గిల్, 3 విరాట్ కోహ్లీ, 4 శ్రేయాస్ అయ్యర్, 5 ఇషాన్ కిషన్ (వికెట్), 6 హార్దిక్ పాండ్యా, 7 రవీంద్ర జడేజా, 8 శార్దూల్ ఠాకూర్/మహమ్మద్ షమీ, 9 కుల్దీప్ యాదవ్, 10 మహ్మద్ సిరాజ్, 11 జస్ప్రీత్ బుమ్రా
పాకిస్థాన్ : 1 ఫఖర్ జమాన్, 2 ఇమామ్-ఉల్-హక్, 3 బాబర్ ఆజం (కెప్టెన్), 4 మహ్మద్ రిజ్వాన్ (వికెట్), 5 అఘా సల్మాన్, 6 ఇఫ్తికర్ అహ్మద్, 7 షాదాబ్ ఖాన్, 8 మహ్మద్ నవాజ్, 9 షాహీన్ షా ఆఫ్రిది, 10 నసీమ్ షా, 11 హరీస్ రౌఫ్