ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొస్తుంది.. ఇప్పుడు వారి అవసరాలను కూడా తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ సౌకర్యాలను కల్పిస్తోంది. ప్రజలకు రేషన్ ఇవ్వడంతో పాటు.. ఇప్పుడు డిష్ టీవీని ఉచితంగా ఇవ్వాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోల పరిస్థితిని మెరుగుపరిచేందుకు మోదీ సర్కార్ ఈ పెద్ద నిర్ణయం తీసుకుంది.
దేశంలో పబ్లిక్ సెక్టార్ ప్రసారాల వినియోగాన్ని పెంచడానికి సెంట్రల్ స్కీమ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆల్ ఇండియా రేడియో ఎఫెమ్ ఛానెల్‌ల కవరేజీని 80 శాతానికి పైగా జనాభాకు విస్తరించాలని, 8 లక్షల డీడీ ఉచిత డిష్ డీటీహెచ్‌ను పంపిణీ చేయడానికి అన్నీ సిద్దం చేసింది.. గిరిజన ప్రాంతాల్లో వుండే జనాలకు సెట్-టాప్ బాక్స్‌లు అందించాలని నిర్ణయించింది..
దేశంలోని 7 లక్షల మంది ఇళ్లలో ఉచితంగా డిష్ టీవీలను అందించాలని ప్లాన్ చేసింది. ఈ పథకం ద్వారా డీటీహెచ్‌ని మరింతగా విస్తరించాలన్నది కేంద్రం ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు పాత వాటిని మార్చి వాటి స్థానంలో కొత్త వాటిని తీసుకు రానున్నారని సమాచారం.. అలాగే 36 టీవీ ఛానెల్‌లను నిర్వహిస్తోంది దూరదర్శన్ సంబంధించిన తయారీ, సేవల ద్వారా పరోక్ష ఉపాధిని సృష్టించే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. డిడి ఫ్రీ డిష్‌ను విస్తరించడం వల్ల డిటిహెచ్ బాక్సుల తయారీ లో ఉపాధిని కూడా కల్పిస్తున్నాయి.. ఈ నిర్ణయం తో ఎంతో మందికి లబ్ది చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తుంది..