మహిళలకు కేంద్రం శుభవార్త.. మరో కొత్త స్కీమ్..!

-

మహిళలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు అందించాలని నిర్ణయం తీసుకుంది. 2023-24 నుంచి 2025-26 మధ్య కాలంలో 15వేల స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు ఇవ్వనున్నారు. రైతులకు అద్దె పద్ధతిలో డ్రోన్లను అందించి ఉపాధి పొందేలా స్కీమును కేంద్రం ప్రవేశపెట్టనుంది. కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

ఈ పథకం కోసం కేంద్రం రూ.1,261 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. విక్షిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా స్వయం సహాయక బృందాలతో ప్రధాని నరేంద్ర మోడీ రేపు గురువారం ఇంటరాక్ట్ అవుతారని పీఎంఓ కార్యాలయము ఓ ప్రకటనలో వెల్లడించింది. వ్యవసాయ రంగంలో టెక్నాలజీని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ పథకం తో పాటు జెన్ ఔషధీ కేంద్రాల సంఖ్యను పదివేల నుంచి 25 వేలకు పెంచనున్నట్టు ప్రధాన కార్యాలయం తెలిపింది. మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పడంతో పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news