జమ్ముకశ్మీర్‌లో రాజకీయాల్లో కీలక పరిణామం

-

జమ్ము కశ్మీర్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జమ్ము కశ్మీర్‌ లో కొత్త కూటమి ఏర్పడింది. గుప్కర్ ప్రంట్ చైర్మన్‌గా ఎన్సీపీ అధినేత ఫరూక్ అబ్దుల్లా నియమితులయ్యారు. డిప్యూటీగా పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఎంపికయ్యారు. కూటమిలో ఎన్సీపీ, పీడీపీ, సీపీఎం, పీపుల్ కాన్ఫరెన్స్ పార్టీలున్నాయి.

ముఫ్తీ నివాసంలో తొలిసారి భేటీ అయిన కూటమి నేతలు నాటి జమ్ము కశ్మీర్ రాష్ట్రం జెండాను సింబల్‌గా ఎంచుకున్నారు. జమ్ముకశ్మీర్ ప్రత్యేక జెండాను ఐక్యపోరాటంతో సాధించుకాంటమన్నారు మెహబూబా ముఫ్తీ. అప్పటివరకు త్రివర్ణపతాకం ఎగరవేయబోనంటూ ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుప్కార్‌ కూటమి బీజేపీకి వ్యతిరేకమే కానీ దేశానికి కాదని ఆమె అన్నారు. కానీ‌ కూటమి దేశానికి వ్యతిరేకమని బీజేపీ అసత్య ప్రచారం చేస్తుందని ఆమె పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news