హార్ధిక్ పాండ్యా సంచలన వ్యాఖ్యలు..నేను జీర్ణించుకోలేపోతున్నా !

-

వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించడంపై స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా స్పందించారు. ప్రపంచకప్ లో మిగిలిన గేమ్స్ ను ఆడలేను అనే విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నానని వెల్లడించారు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. క్రికెట్‌ వరల్డ్ కప్ 2023 నుంచి హార్ధిక్ పాండ్యా ఔట్ అయిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా వరల్డ్ కప్ నుంచి వైదొలిగాడు టీమిండియా ఆల్‌రౌండర్ పాండ్యా.

Hardik Pandya sensational comments

అయితే…హార్దిక్ పాండ్యా స్థానంలో టీమ్‌ లోకి ప్రసిధ్ కృష్ణ రానున్నాడు. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన చేసింది. ఇక ఈ తరుణంలోనే… వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించడంపై స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా స్పందించారు. ‘ప్రపంచకప్ లో మిగిలిన గేమ్స్ ను ఆడలేను అనే విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా. కానీ ప్రతి గేమ్ లో టీం తో ఉండి… వారిని ఉత్సాహపరుస్తుంటాను. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఈ టీం ఎంతో స్పెషల్. మేం ప్రతి ఒక్కరిని గర్వపడేలా చేస్తామని నమ్ముతున్నాను’ అనే హార్దిక్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news