తాను రాజీనామా చేయలేదు.. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్

-

హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం  నెలకొనడంతో తాను తన పదవికి రాజీనామా చేసినట్లు మీడియాలో వచ్చిన వార్తలను ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖూ బుధవారం తోసిపుచ్చారు. తాను “యోధుడిని” అని, రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌లో తన మెజారిటీని నిరూపించుకుంటానని ఆయన నొక్కి మరీ చెప్పారు.

ఇక బడ్జెట్ సెషన్‌లో మెజారిటీని నిరూపిస్తాం అని..  కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల  పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేస్తుందని కూడా నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను అని సీఎం సుఖ్వీందర్ సింగ్ చెప్పారు. ఆరుగురు పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ విప్‌కు వ్యతిరేకంగా వెళ్లి ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడంతో ప్రతిపక్ష పార్టీకి అనూహ్య విజయాన్ని అందించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది.  హిమాచల్ ప్రదేశ్‌ రాజకీయ సంక్షోభం, ముఖ్యమంత్రి పదవికి సుఖ్వీందర్ సింగ్ సుఖు రాజీనామా వార్తలు, 15 మంది బీజేపీ ఎమ్మెల్యేల‌పై వేటు వేశారు స్పీకర్. ప్రస్తుతం హిమాచల్ రాజకీయాల గురించి కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరుపుతోంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version