ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహానికి చిన్నారి మృతి చెందింది. హెల్మెట్ ధరించకుండా వెళ్తున్న బైక్ ను అనూహ్యంగా ఆపే ప్రయత్నం చేయగా, అదుపుతప్పి రోడ్డుపై పడి, టెంపో ఢీకొనడంతో పసి పాప మృతి చెందింది. కర్ణాటక రాష్ట్రం మద్దూరు మండలం గొరవనహళ్లి గ్రామానికి చెందిన అశోక్, వాణి దంపతులు తమ కుమార్తె ప్రతీక్షను వైద్యం కోసం మండ్య జిల్లాలోని మెడికల్ కళాశాల ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

అశోక్ హెల్మెట్ ధరించలేదని మండ్య మండల కేంద్రంలోని నంద సర్కిల్ వద్ద ట్రాఫిక్ పోలీసులు వారి బైక్ ను ఆపడానికి హడావిడి చేయగా, బైకు అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది చిన్నారి ప్రతీక్ష. అదే సమయంలో వెనక నుండి వస్తున్న టెంపో ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది చిన్నారి ప్రతీక్ష. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించారు తల్లిదండ్రులు, స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకొని బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు.